వాషింగ్టన్, ఏప్రిల్ 22: ఎప్పుడూ చీకటి కమ్ముకొని ఉండే చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలు సాగించడం శాస్త్రవేత్తలకు సవాళ్ల తో కూడుకున్న పని. ఈ క్రమంలో నాసా శాస్త్రవేత్తలు జీపీఎస్ అవసరం లేకుండానే రియల్ టైమ్ 3డీ మ్యాప్‌ను సృష్టించగల బ్యాక్‌ప్యాక్‌ను (భుజాలను ఆధారంగా చేసుకొని వీపుకు తగిలించుకొనే సంచి) అభివృద్ధి చేశారు.
బ్యాక్‌ప్యాక్‌కు అమర్చిన లేజర్ లైట్ చీకట్లను పారద్రోలి అక్కడి నేలను స్పష్టంగా కనబడేలా చేస్తే, ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ కంటిన్యూస్ వేవ్ (ఎఫ్ఎంసీడబ్ల్యూ) ప్రమాదకరమైన శిలలు, రాళ్లు-రప్పలకు సంబంధించిన సమాచారంపై అలర్ట్ చేస్తుంది.