Aung San Suu Kyi: మయన్మార్ బహిష్కృత నాయకురాలు అంగ్‌సాన్ సూకీకి నాలుగేండ్ల జైలు
Aung San Suu Kyi: మయన్మార్‌కు చెందిన బహిష్కృత నాయకురాలు అంగ్‌సాన్ సూకీకి ( Aung San Suu Kyi ) అక్కడి న్యాయస్థానం నాలుగేండ్ల జైలుశిక్ష విధించింది. మిలిటరీకి వ్యతిరేకంగా అసమ్మతిని

న్యూఢిల్లీ: మయన్మార్‌కు చెందిన బహిష్కృత నాయకురాలు అంగ్‌సాన్ సూకీకి ( Aung San Suu Kyi ) అక్కడి న్యాయస్థానం నాలుగేండ్ల జైలుశిక్ష విధించింది. మిలిటరీకి వ్యతిరేకంగా అసమ్మతిని రెచ్చగొట్టడం, సహజ విపత్తుల చట్టంలోని కొవిడ్ నియమాల ఉల్లంఘన నేరం కింద ఆమెను దోషిగా తేల్చింది. మిలిటరీ ప్రభుత్వం అంగ్‌సాన్ సూకీపై మొత్తం 11 కేసులు బనాయించింది. అయితే ఆ అభియోగాలన్ని అబద్దాలని అంగ్‌సాన్ సూకీ కొట్టిపారేశారు.
గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో అంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని NLD పార్టీ ఘన విజయం సాధించింది. అయితే, ఆ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ గత ఫిబ్రవరిలో మిలిటరీ సైనిక తిరుగుబాటు చేసి పౌర ప్రభుత్వాన్ని కూల్చేసింది. అప్పటి నుంచి సూకీకి గృహ నిర్బంధం విధించారు. అమెపై రకరకాల అవినీతి అభియోగాలు మోపారు. కాగా, అమెపై నమోదైన అన్ని అభియోగాల్లో దోషిగా తేలితే సూకీకి వందేండ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

