సగేయింగ్: మయన్మార్లో జుంటా సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడు మంది చిన్నారులు మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. ఓ స్కూల్ బిల్డింగ్లో రెబల్స్ తలదాచుకున్నట్లు భావించిన సైన్యం తమ హెలికాప్టర్లతో ఆ బిల్డింగ్పై కాల్పులు జరిపింది. దీంతో ఆ స్కూల్లో ఉన్న ఏడు మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది మయన్మార్లో ఆర్మీ స్థానిక ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే.
హెలికాప్టర్లు జరిపిన కాల్పుల వల్ల కొందరు పిల్లలు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మృతదేహాలను ఆర్మీ తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. స్కూల్ బిల్డింగ్కు బుల్లెట్ రంధ్రాలు పడ్డాయి. కొన్ని చోట్ల రక్తపు మరకలు ఉన్నాయి. ఓ బౌద్ధ ఆశ్రమంలో రెబల్ గ్రూపు అయిన కాచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీతో పాటు పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ ఆశ్రయం పొందుతున్నట్లు తెలిసింది. ఆకస్మిక తనిఖీ చేపట్టిన భద్రతా దళాలు ఆ స్కూల్ బిల్డింగ్పై దాడి చేశాయి. హెలికాప్టర్ కాల్పుల్లో కొందరు గ్రామస్థులు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది.