హైదరాబాద్: అతనో రిటైర్డ్ మార్షియల్ ఆర్టిస్ట్. కానీ అతనిలో సత్తా తగ్గలేదు. తన బలం ఏంటో ఓల్డేజ్లోనూ చూపించాడు. జర్మనీకి చెందిన మొహమ్మద్ ఖారిమానోవిక్ .. ఓ సూపర్హూమన్ ఫీట్ సాధించాడు. ఒక్క నిమిషంలోనే ఒంటి చేతితో 48 కొబ్బరియాలు పగులకొట్టేశాడు(Coconuts Smashed). అది కూడా కండ్లకు గంతలు కట్టుకుని పని పూర్తి చేశాడు. ఆ అమేజింగ్ అచీవ్‌మెంట్‌కు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్టు చేసింది. టేబుల్‌పై రెండు వరుసల్లో పేర్చిన కొబ్బరికాయలను అతను ఈజీగా పగులకొట్టేశాడు. మీరూ ఆ వీడియోను చూడండి.