కాబూల్‌లో మసీదుపై బాంబు దాడి.. 50 మందికిపైగా దుర్మణం
Kabul | ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో (Kabul) మరోసారి బాంబు దాడి జరిగింది. కాబూల్‌లోని ఖలీఫా సాహిబ్ మసీదులో మానవ బాంబు తనను తాను పేల్చుకోవడంతో 50 మందికి పైగా మృతించెందారు.
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో (Kabul) మరోసారి బాంబు దాడి జరిగింది. కాబూల్‌లోని ఖలీఫా సాహిబ్ మసీదులో మానవ బాంబు తనను తాను పేల్చుకోవడంతో 50 మందికి పైగా మృతించెందారు. మరో వందమంది గాయపడ్డారు. చివరి శుక్రవారం కావడంతో ఖలీపా సాహిబ్ మసీదు జనాలతో కిక్కిరిసి పోయింది. అంతా ప్రార్ధనలు ముగించుకున్న తర్వాత.. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో మసీదులో ఎక్కడ చూసినా శవాలు, క్షతగాత్రులే కనిపించారని స్థానికులు తెలిపారు. అప్పటికే ప్రార్ధన చేస్తున్నవారిలో కలిసిపోయిన మానవబాంబు తనను తాను పేల్చుకోవడంతో ఈ ఘోరం జరిగిందని వెల్లడించారు.
ఈ పేలుడులో పది మంది చనిపోయారని, మరో 20 మంది గాయపడ్డారని ఆఫ్ఘనిస్థాన్ ఇంటీరియర్ మినిస్టర్ బిస్ముల్లా హబీబ్ చెప్పారు. అయితే ఇప్పటివరకు 66 మంది మరణించారని, 78 మంది గాయపడ్డారని వైద్య వర్గాల సమాచారం. కాగా, ఈ మారణహోమానికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ సంస్థా ప్రకటించలేదు.
పవిత్ర రంజాన్ మాసంలో ప్రజలనే లక్ష్యంగా చేసుకుని దేశంలో వరుస దాడులు జరుగుతున్నాయి. గతవారం మజర్ ఈ షెరీఫ్ పట్టణంలోని ఓ మసీదుపై జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించిన విషయం తెలిసింది. ఈ పేలుడుకు తామే కారణమని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రసంస్థ ప్రకటించుకుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

