న్యూయార్క్: అమెరికా సామాజిక కార్యకర్త మోనికా లివిన్స్కీ(Monica Lewinsky).. మహిళల దుస్తుల బ్రాండ్ రిఫార్మేషన్ కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్నారు. అయితే నవంబర్‌లో జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల కోసం ఆ కంపెనీ తరపున ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. యూ యావ్ గాట్ ద పవర్ అన్న నినాదంతో రిఫార్మేషన్ కంపెనీ కొత్త దుస్తుల్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. అయితే లివిన్స్కీ ఆ కంపెనీకి చెందిన వెరైటీ దుస్తుల్ని వేసుకున్నది. ఓటు వేయడం అంటే మీ వాయిస్‌ను వినిపించడమే అని, ప్రజాస్వామ్యంలో ఇది చాలా కీలకమైందని లివిన్స్కీ అన్నారు. ప్రజల వద్ద అధికారం ఉందని, ఈ ఏడాది వాళ్లు ఆ అధికారాన్ని వినియోగించుకోవాలని ఆమె తన ప్రచారంలో పేర్కొన్నది.
1990 దశకంలో మోనికా లివిన్స్కీ వైట్‌హౌజ్‌లో ఇంటెర్న్‌గా చేశారు. ఆ సమయంలో అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో అఫైర్ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం రచయితగా మారిన లివిన్స్కీ 22 ఏళ్ల వయసులో అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో శృంగారం సాగించింది. బిల్ క్లింటన్ కన్నా వయసులో 27 ఏళ్ల పెద్ద అయిన ఆమె గురించి అప్పట్లో అమెరికా మీడియాలో విస్తృత రీతిలో కథనాలు వచ్చాయి. మోనికాతో తొలుత రిలేషన్ లేదని ప్రకటించిన బిల్..ఆ తర్వాత ఆమెతో శారీరక సంబంధం ఉన్నట్లు ఒప్పుకున్నారు.