బెర్లిన్: మాల్డోవాకు వెళ్లిన ఆస్ట్రియా అధ్యక్షుడు వాన్ డర్ బెల్లెన్కు చేదు అనుభవం ఎదురైంది. మాల్డోవా అధ్యక్షురాలు మేయి సందు పెంపుడు కుక్క ‘కోడ్రట్’ బెల్లెన్ చేతిని కొరికింది. మాల్డోవా రాజధానిలోని అధ్యక్షురాలి అధికారిక నివాసంలో శుక్రవారం సండు, బెల్లెన్ మాటాడుకొంటూ ఉండగా ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా తెలిపింది.
అధ్యక్షురాలి రెస్క్యూ డాగ్‌గా..‘కోడ్రట్’ ఆ దేశ ప్రథమ కుక్క హోదాను కలిగి ఉంది. ఈ ఘటనలో బెల్లెన్ చేతికి స్వల్ప గాయమైంది. ఘటనపై సండు బెల్లెన్కు క్షమాపణ చెప్పారు. పర్యటన ముగించుకొని వెళ్లేప్పుడు ఆస్ట్రియా అధ్యక్షుడు బెల్లెన్ ఆ కుక్కకు ఓ బొమ్మను బహూకరించటం విశేషం.