Miss Universe | విశ్వసుందరి పోటీల్లో గొడవ.. వాకౌట్ చేసిన అందాల భామలు
Miss Universe | థాయ్‌లాండ్ (Thailand) లో 74వ విశ్వసుందరి (Miss Universe) పోటీల్లో హైడ్రామా చోటుచేసుకుంది. ఆతిథ్య దేశానికి చెందిన ఓ అధికారికి, మెక్సికో భామకు మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం బహిరంగ క్షమాపణలు చెప్పుకునే వరకు వెళ్లింది.
Miss Universe : థాయ్‌లాండ్ (Thailand) లో 74వ విశ్వసుందరి (Miss Universe) పోటీల్లో హైడ్రామా చోటుచేసుకుంది. ఆతిథ్య దేశానికి చెందిన ఓ అధికారికి, మెక్సికో భామకు మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం బహిరంగ క్షమాపణలు చెప్పుకునే వరకు వెళ్లింది. ఈ వివాదం మొత్తం ఫేస్బుక్లో లైవ్‌స్ట్రీమ్ కావడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న మిస్ మెక్సికో ఫాతిమా బోష్ ఒక షూట్‌కు హాజరుకాలేదు. మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ నేషనల్ డైరెక్టర్, మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాత్.. ఆమె గైర్హాజరుపై ప్రశ్నించారు. తెలివితక్కువ మనిషి అనే అర్థం వచ్చేలా ఆమెను నిందించారు. దాంతో ఆమె ఎదురుతిరిగారు.
‘మీరు మమ్మల్ని గౌరవించినట్లే మేం మిమ్మల్ని గౌరవిస్తాం. ఇక్కడ నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా. నా దేశ సంస్థతో మీకు ఏదైనా సమస్య ఉంటే అందులోకి నన్ను లాగకండి’ అని తీవ్రంగా స్పందించారు. ‘ముందుగా నా మాట విని, ఆ తర్వాత వాదించండి’ అంటూ నవాత్ బదులిచ్చారు. ఆ విధంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
అనంతరం ఫాతిమాతోపాటు మరికొన్ని దేశాలకు చెందిన కంటెస్టెంట్లు వేదిక నుంచి వాకౌట్ చేశారు. తర్వాత ఆమె బయటకు వచ్చి తన అసహనాన్ని వెళ్లగక్కారు. ఈ వ్యవహారం ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ అయింది. నవాత్‌పై విమర్శలు వ్యక్తం కావడంతో ఆ డైరెక్టర్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. దీనిపై మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ కూడా స్పందించింది. ఈ ఘటనను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

