నారింజ, నలుపు రంగులో మెరిసిపోయే ఐకానిక్ మైగ్రేటరీ మోనార్క్ సీతాకోక చిలుకను శాస్త్రవేత్తలు అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) మొట్టమొదటిసారిగా వలసపోతున్న మోనార్క్ సీతాకోకచిలుకను రెడ్ లిస్ట్‌లో చేర్చింది. వాటిని అంతరించిపోతున్న జాతిగా వర్గీకరించింది. పూర్తిగా అంతరించిపోయేందుకు ఇంకా రెండు దశల దూరంలో ఉంది.
మైగ్రేటరీ మోనార్క్ సీతాకోక చిలుకది వినాశకరమైన క్షీణత అని డ్యూక్ విశ్వవిద్యాలయంలో పర్యావరణ శాస్త్రవేత్త స్టువర్ట్ పిమ్మ్ పేర్కొన్నారు. ఇది ప్రపంచంలో అత్యంత గుర్తించదగిన సీతాకోకచిలుకల్లో ఒకటని తెలిపారు. ఉత్తర అమెరికాలో మోనార్క్ సీతాకోకచిలుకల జనాభా పదేళ్లలో 72 శాతం నుంచి 22 శాతానికి పడిపోయిందని పరిశోధకులు అంచనా వేశారు. ఈ క్షీణత తమకు ఆందోళన కలిగిస్తున్నదని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో పరిరక్షణ జీవశాస్త్రవేత్త నిక్ హడ్డాడ్ పేర్కొన్నారు.