Micro Plastics | న్యూయార్క్ : పర్యావరణానికి, మనుషుల ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతున్న మైక్రో ప్లాస్లిక్ ముప్పు లేని కొత్త పాలివినైల్ క్లోరైడ్(పీవీసీ)ని అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. స్వచ్ఛమైన పీవీసీ వేడిని తట్టుకోలేదు. అందుకే తయారీదారులు పలు రసాయనాలను ఉపయోగించి పీవీసీతో ఉత్పత్తులను తయారుచేస్తారు. ఈ రసాయనాలు కొంతకాలానికి బయటకు వచ్చేస్తాయి. ఫలితంగా పీవీసీ నుంచి మైక్రోప్లాస్టిక్‌లు పర్యావరణంలోకి విడుదలవుతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా శాస్త్రవేత్తలు పీవీసీ ఉత్పత్తుల తయారీకి కొత్త రసాయన ఫార్ములాను తయారుచేశారు.