న్యూయార్క్: అమెరికా మాజీ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama).. వైట్‌హౌజ్‌లో ఉన్న సమయంలో.. వైవాహిక బంధంలో ఒడిదిడుకులను ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అందుకే ఇప్పుడు తన భార్య మిచెల్ ఒబామాతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు చెప్పారు. హామిల్టన్ కాలేజీ ప్రెసిడెంట్ స్టీవెన్ టెప్పర్‌తో జరిగిన చర్చలో బరాక్ ఒబామా ఈ విషయాన్ని తెలిపారు. రెండు పర్యాయాలు దేశాధ్యక్ష హోదాలో ఉండడం వల్ల.. భార్య మిచెల్ ఒబామాతో రిలేషన్ దెబ్బతిన్నట్లు బరాక్ ఒబామా తెలిపారు. భార్య మిచెల్‌తో బంధంలో తీవ్ర లోటు ఏర్పడినట్లు ఆయన చెప్పారు. అయితే అప్పుడు ఏర్పడిన అగాధాన్ని ఇప్పుడు చిన్న చిన్న సరదాలతో తీర్చుకుంటున్నట్లు తెలిపారు.
తమ మ్యారేజ్ లైఫ్ గురించి గతంలోనూ ఒబామా దంపతులు పబ్లిక్‌గా మాట్లాడారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు వాళ్లు చెప్పారు. ముఖ్యంగా దేశాధ్యక్షుడిగా ఉన్నట్లు సమయంలో.. దంపతుల మధ్య ఓ దశలో గ్యాప్ కూడా వచ్చింది. బరాక్, మిచెల్ ఒబామా.. 1992లో పెళ్లి చేసుకున్నారు. వాళ్లిద్దరి బంధానికి 33 ఏళ్లు అయ్యింది. అయితే వైట్‌హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే తన భార్యతో రిలేషన్ ఇంప్రూవ్ అయినట్లు బరాక్ వెల్లడించారు.
ఓ దశాబ్ధ కాలం పాటు తన భర్తతో కలిసి ఉండలేకపోయినట్లు మిచెల్ ఒబామా గతంలో ఓ సారి చెప్పారు. పిల్లలు చిన్నగా ఉన్న సమయంలో ఇలా జరిగిందని ఆమె తెలిపారు. రిలేషన్లో చిక్కులు రావడంతో 2018లో ఓ దశలో మ్యారేజ్ కౌన్సిలర్ వద్దకు వెళ్లినట్లు మిచెల్ చెప్పారు. ఒబామా దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారి పేర్లు సాషా, మాలియా.