Paris Jackson: 600 మిలియన్ల డాలర్లు ఇవ్వండి.. కోర్టును ఆశ్రయించిన మైఖేల్ జాక్సన్ కుమార్తె
Paris Jackson: పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ కుమార్తె పారిస్ జాక్సన్ కోర్టును ఆశ్రయించారు. సింగర్ జాక్సన్‌కు చెందిన ఎస్టేట్ నుంచి సుమారు 600 మిలియన్ల డాలర్లను ట్రస్టుకు బదిలీ చేయాలని పారిస్ జాక్సన్ లాస్ ఏంజిల్స్ కోర్టులో కేసు వేసింది.
లాస్ ఏంజిల్స్: పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ మృతిచెంది 17 ఏళ్లు అవుతోంది. ఆ మూన్‌వాకర్ తన ముగ్గురు పిల్లలకు ట్రస్టు రాసిచ్చేశాడు. అయితే మైఖేల్ జాక్సన్ కుమార్తె పారిస్ జాక్సన్ ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. సింగర్ జాక్సన్‌కు చెందిన ఎస్టేట్ నుంచి సుమారు 600 మిలియన్ల డాలర్లను ట్రస్టుకు బదిలీ చేయాలని పారిస్ జాక్సన్ లాస్ ఏంజిల్స్ కోర్టులో కేసు వేసింది. మైఖేల్ జాక్సన్ మ్యూజిక్ డీల్స్, ప్రాపర్టీ సేల్స్ ద్వారా ఎస్టేట్‌కు బిలియన్ల డాలర్ల ఆదాయం వస్తోందని, కానీ ఫ్యామిలీ ట్రస్టుకు ఎటువంటి రాబడి లేదని, అందుకే ఎస్టేట్ ఆదాయంలోని 600 మిలియన్ల డాలర్లను ఫ్యామిటీ ట్రస్టుకు బదిలీ చేయాలని పారిస్ జాక్సన్ కోరింది. కానీ ఎస్టేట్ నిర్వాహకులు మాత్రం ఆ అభ్యర్థనను తిరస్కరిస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు చాలా ఉన్నాయని, అవి తీరే వరకు ట్రస్టుకు డబ్బులు ఇవ్వలేమని ఎంజే ఎస్టేట్ నిర్వాహకులు చెప్పేశారు.
మైఖేల్ జాక్సన్ 2009 జూన్‌లో 50 ఏళ్ల వయసులో చనిపోయారు. ఆయనకు ముగ్గురు పిల్లలు ప్రిన్స్, పారిస్, బిగి ఉన్నారు. పారిస్ జాక్సన్ ప్రస్తుతం 28 ఏళ్లు ఉన్నది. అయితే పిల్లలు 21 ఏళ్లకు చేరుకున్న తర్వాత ట్రస్టు ఆదాయంలో ఒక్కొక్కరికి షేర్ ఇవ్వాల్సి ఉంటుంది. వయసు దాటినా ట్రస్టు నుంచి కావాల్సిన డబ్బులు అందడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Paris Jackson: 600 మిలియన్ల డాలర్లు ఇవ్వండి.. కోర్టును ఆశ్రయించిన మైఖేల్ జాక్సన్ కుమార్తె
T-Hub | కలలకు రెక్కలు తొడిగి 11 వసంతాలు: అంతర్జాతీయ ఆవిష్కరణల వేదికగా ఎదిగిన ‘టీ-హబ్’
AP News | ఏపీలో కొనసాగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్..!
KTR | బడా భాయ్ మోదీ.. తన ABVP చోటా భాయ్ రేవంత్‌పై ఎప్పటికీ చర్యలు తీసుకోరు: కేటీఆర్
Chandrayaan | ‘చంద్రయాన్’ నుంచి ‘చీఫ్ సైంటిస్ట్’ శివ కుమార్ దీకొండ పాత్ర పరిచయం!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

