AP News | ఏపీలో కొనసాగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్..!
AP News | ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. గురవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల బారులు తీరారు.
AP News : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. గురవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల బారులు తీరారు. రాష్ట్రంలోని 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 21,012 మంది పోటీ చేస్తున్నారు.
మొత్తం 31,460 పోలింగ్ కేంద్రాల్లో 2.61 కోట్లమంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడ్డాక నామినేషన్ల ఉపసంహరణ నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,128 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది, జడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది పోటీ పడుతున్నారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,01,116 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సేవలు వినియోగిస్తున్నారు.
వీరిలో రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్, అసిస్టెంట్, ఇతర ప్రిసైడింగ్ అధికారులు, జోనల్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులు ఉన్నారు. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు మండలాల్లో పూర్తిగా, మరో మండలంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. వీటిలో గురువారానికి బదులు శుక్రవారం పోలింగ్ నిర్వహించి శనివారం ఓట్లు లెక్కిస్తారు.
ఏలూరు జిల్లాలో వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లోనూ, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలోనూ పూర్తిగా పోలింగ్ వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో కొనసాగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్..!
KTR | బడా భాయ్ మోదీ.. తన ABVP చోటా భాయ్ రేవంత్‌పై ఎప్పటికీ చర్యలు తీసుకోరు: కేటీఆర్
Chandrayaan | ‘చంద్రయాన్’ నుంచి ‘చీఫ్ సైంటిస్ట్’ శివ కుమార్ దీకొండ పాత్ర పరిచయం!
BRS | బీఆర్ఎస్లోకి కొనసాగుతున్న చేరికలు.. గులాబీ గూటికి నిర్మల్ యువ నాయకుడు నల్ల వినయ్ రెడ్డి
Sunny Deol | సన్నీ డియోల్ చిత్రం ‘సూర్య’కు హైకోర్టులో ఊరట.. విడుదలపై స్టే నిరాకరణ!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

