Chandrayaan | ‘చంద్రయాన్’ నుంచి ‘చీఫ్ సైంటిస్ట్’ శివ కుమార్ దీకొండ పాత్ర పరిచయం!
Venu Udugula | ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల సమర్పణలో, ‘సింబ స్క్రీన్ స్టోరీస్’ పతాకంపై ప్రవీణ్ మొలక నిర్మిస్తోన్న వైవిధ్యమైన చిత్రం ‘చంద్రయాన్’.
Shiva Kumar Dheekonda | ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల సమర్పణలో, ‘సింబ స్క్రీన్ స్టోరీస్’ పతాకంపై ప్రవీణ్ మొలక నిర్మిస్తోన్న వైవిధ్యమైన చిత్రం ‘చంద్రయాన్’ (Chandrayaan). గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ హిలేరియస్ అడ్వెంచర్ కామెడీ సినిమా నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఈ చిత్రం విడుదలకు ఇంకా 8 రోజులే ఉండడంతో పాత్రలను పరిచయం చేస్తుంది చిత్రయూనిట్. ఇందులో భాగంగా హీరోగా నటిస్తున్న శివ కుమార్ దీకొండ (Shiva Kumar Dheekonda) పాత్రను చిత్ర యూనిట్ అత్యంత ఆసక్తికరంగా పరిచయం చేసింది. ఈ మిషన్ వెనుక ఉండే అసలు మాస్టర్ మైండ్ మరియు ‘చీఫ్ సైంటిస్ట్’ (Chief Scientist) అంటూ శివకుమార్ దీకొండ లుక్తో కూడిన కొత్త ప్రచార పోస్టర్ను విడుదల చేశారు.
సమాజంలో తమని తక్కువ చేసి మాట్లాడిన వారి ముందు తమ ప్రతిభను నిరూపించుకోవాలని నలుగురు గ్రామీణ యువకులు గట్టిగా నిర్ణయించుకుంటారు. ఎవరికీ అంతుచిక్కని ఆలోచనగా సొంతంగా ఒక రాకెట్ తయారు చేసి, ఏకంగా చంద్రమండలానికి వెళ్లాలని వారు సాహసించడమే ఈ చిత్ర ప్రధానాంశం. ఈ క్రమంలో మందమర్రి నుంచి చందమామ వరకు సాగే ఈ ప్రయాణం ఆద్యంతం నవ్వులు పూయించనుంది. శివ కుమార్ దీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, ‘బలగం’ సత్యనారాయణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayaan | ‘చంద్రయాన్’ నుంచి ‘చీఫ్ సైంటిస్ట్’ శివ కుమార్ దీకొండ పాత్ర పరిచయం!
BRS | బీఆర్ఎస్లోకి కొనసాగుతున్న చేరికలు.. గులాబీ గూటికి నిర్మల్ యువ నాయకుడు నల్ల వినయ్ రెడ్డి
Sunny Deol | సన్నీ డియోల్ చిత్రం ‘సూర్య’కు హైకోర్టులో ఊరట.. విడుదలపై స్టే నిరాకరణ!
Stock Markets: దలాల్ స్ట్రీట్లో దివాళీ ధమాకా.. దూసుకెళ్తున్న స్టాక్మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు 7 లక్షల కోట్ల బొనాంజా
Virat Kohli: విరాట్ కోహ్లీ 38వ బర్త్డే.. విషెస్ చెప్పిన బీసీసీఐ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

