Crypto Coin | సొంతంగా క్రిప్టో టోకెన్‌ను విడుదల చేసిన మెలానియా.. ట్రంప్ మీమీ కాయిన్‌కు తగ్గిన డిమాండ్
Crypto Coin | ట్రంప్ సతీమణి, అమెరికాకు కాబోయే ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) సొంతంగా ఓ క్రిప్టో కరెన్సీ టోకెన్ (cryptocurrency token)ను పరిచయం చేశారు.
Crypto Coin | అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇవాళ బాధ్యతలు చేపట్టబోతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచం దృష్టి మొత్తం ఇప్పుడు అగ్రరాజ్యంపై పడింది. ఆయన తీసుకునే నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు ట్రంప్ హయాంలో క్రిప్టో కరెన్సీకి జాతీయ ప్రాధాన్యం ఉంటుందని అమెరికా మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు ట్రంప్ తన సొంత క్రిప్టో కరెన్సీని మార్కెట్లోకి తీసుకొచ్చారు. $TRUMP పేరుతో ఈ మీమ్ కాయిన్ (Trump meme coin)ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు ట్రంప్ సతీమణి, అమెరికాకు కాబోయే ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) కూడా సొంతంగా ఓ క్రిప్టో కరెన్సీ టోకెన్ (cryptocurrency token)ను పరిచయం చేశారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు రోజు అంటే ఆదివారం (అమెరికా కాలమానం ప్రకారం) సాయంత్రం ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ పేరుతో విక్టరీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జరుగుతున్న సమయంలో తాను ఓ మీమ్ కాయిన్‌ను విడుదల చేస్తున్నట్లు మెలానియా ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. $MELANIA పేరుతో ఈ మీమీకాయిన్ను పరిచయం చేశారు.
మరోవైపు ట్రంప్ టోకెన్ మార్కెట్లో దుమ్మురేపుతోంది. మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే దీని విలువ అమాంతం పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. లాంచ్ అయిన మూడు గంటల వ్యవధిలోనే ఏకంగా 300 శాతం పెరిగి క్రిప్టో ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపిస్తోందని టాక్. ఇక మెలానియా క్రిప్టో కాయిన్ విడుదల చేసిన తర్వాత ట్రంప్ టోకెన్ విలువ భారీగా పడిపోయినట్లు యూఎస్ మీడియా పేర్కొంటోంది.
The Official Melania Meme is live!
You can buy $MELANIA now. https://t.co/8FXvlMBhVf
FUAfBo2jgks6gB4Z4LfZkqSZgzNucisEHqnNebaRxM1P pic.twitter.com/t2vYiahRn6
— MELANIA TRUMP (@MELANIATRUMP) January 19, 2025
Also Read..
Donald Trump | అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ జీతం ఎంతో తెలుసా..?
TikTok | టిక్‌టాక్ ఈజ్ బ్యాక్.. ట్రంప్ హామీతో యాప్ సేవల పునరుద్ధరణకు శ్రీకారం
Donald Trump | ట్రంప్ ప్రమాణం నేడే.. శ్వేతసౌధ పీఠంపై మరోసారి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

