Bunkers | బంకర్లు కడుతున్న బిలియనీర్లు.. హవాయి దీవుల్లో జుకర్‌బర్గ్ బంకర్
Bunkers | మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ హవాయి దీవుల్లోని కవాయి ద్వీపంలో రహస్య బంకర్ నిర్మిస్తున్నారట. దీనికి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ బంకర్ నిర్మాణం విషయాన్ని ఆయన చాలా రహస్యంగా ఉంచుతున్నారు.
- వందల ఎకరాల భూముల్లో ఎస్టేట్లు
- వీటిల్లోనే విలాసవంతమైన బంకర్లు
న్యూయార్క్, మార్చి 5: మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ హవాయి దీవుల్లోని కవాయి ద్వీపంలో రహస్య బంకర్ నిర్మిస్తున్నారట. దీనికి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ బంకర్ నిర్మాణం విషయాన్ని ఆయన చాలా రహస్యంగా ఉంచుతున్నారు. 2014 నుంచి ఈ దీవిలో పలు దఫాలుగా జుకర్‌బర్గ్ భూమి కొనుగోలు చేసి 1,400 ఎకరాలలో భారీ ఎస్టేట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులోనే ఇప్పుడు బంకర్ నిర్మిస్తున్నారు.
చాలామంది బిలియనీర్లకు బంకర్లు
మార్క్ జుకర్‌బర్గ్ మాత్రమే కాదు బిలియనీర్లు చాలామంది ఇప్పుడు దీవుల్లో ఎస్టేట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎస్టేట్లలోనే సకల సౌకర్యాలతో బంకర్లు, రహస్య ప్రదేశాలను నిర్మించుకుంటున్నారట. బిల్ గేట్స్, ఓప్ర విన్ఫ్రే, రిచర్డ్ బ్రాన్సన్, లార్రీ పేజ్, జెఫ్ బేజోస్, మార్క్ బెనియాఫ్ వంటి కుబేరులు ఇప్పటికే వేర్వేరు దీవుల్లో పెద్ద ఎత్తున భూమిని కొనుగోలు చేశారు. వీటిల్లోనే బంకర్లు ఉన్నాయనే ప్రచారం ఉన్నది. మారుమూల దీవులే సేఫ్ అసలు ధనవంతులంతా ఎందుకు ఇప్పుడు బంకర్లు కట్టుకుంటున్నారు ? అంత అవసరం ఏమొచ్చింది ? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ప్రకృతి విపత్తు తలెత్తినా, యుద్ధ పరిస్థితులు వచ్చినా సురక్షితంగా ఉండేందుకు ముందుచూపుతో బంకర్లను నిర్మించుకుంటున్నారనే మాట ప్రధానంగా వినిపిస్తున్నది. స్టేటస్ సింబల్‌గా కూడా బంకర్లు నిర్మిస్తున్నారనే మాట కూడా ఉంది. అయితే, బంకర్ల నిర్మాణానికి బిలియనీర్లు ఎక్కువగా మారుమూల ద్వీపాలనే ఎంచుకుంటున్నారు. ప్రభుత్వాల జోక్యం తక్కువగా ఉండటం, నిరసనలు, అల్లర్లు, యుద్ధం జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని సురక్షిత ప్రాంతాలుగా బిలియనీర్లు భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

