Artificial Heart | కాన్బెర్రా : హార్ట్ ఫెయిల్యూర్ అయిన ఓ ఆస్ట్రేలియన్కు కృత్రిమ గుండెను అమర్చగా… అతడు దాంతో 100 రోజులు జీవించాడని, ఇది ప్రపంచంలో తొలిసారి అని సిడ్నీ వైద్యులు బుధవారం ప్రకటించారు. సదరు వ్యక్తి కృత్రిమ గుండెతో 100 రోజులు జీవించిన తర్వాత, దాత లభించటంతో.. వైద్యులు జరిపిన ఇంప్లాంట్ విజయవంతమైందని తెలిపారు. దీంతో అతడు పూర్తి ఆరోగ్యంతో దవాఖాన నుంచి బయటకు వచ్చాడని చెప్పారు. దాత దొరకటంతో ఇంప్లాంట్ జరిపామని సిడ్నీ వైద్యులు తెలిపారు.