Wildfires | కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు.. 29 మంది అరెస్ట్
Wildfires | అమెరికాలో కార్చిచ్చు (Wildfires) బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైల్డ్‌ఫైర్ కారణంగా అమెరికాలోని సంపన్నుల నగరంగా పేరొందిన లాస్ ఏంజెల్స్ (Los Angeles) మరభూమిని తలపిస్తోంది.
Wildfires | అమెరికాలో కార్చిచ్చు (Wildfires) బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైల్డ్‌ఫైర్ కారణంగా అమెరికాలోని సంపన్నుల నగరంగా పేరొందిన లాస్ ఏంజెల్స్ (Los Angeles) మరభూమిని తలపిస్తోంది. ఖరీదైన ఇళ్లు, కార్లు, విలువైన సామగ్రి మంటల్లో కాలిబూడిదవుతున్నాయి. చాలా మంది ధనవంతులు, సెలబ్రిటీలు తమ సామాన్లు, కార్లను ఇళ్లలోనే వదిలేసి బతుకుజీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ విపత్తును కొందరు అవకాశంగా చేసుకొని దోపిడీలకు (Robbing Homes) పాల్పడుతుండటం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
బిలియనీర్లు, హాలీవుడ్ స్టార్స్ వదిలేసి వెళ్లిన ఇళ్లను దోపిడీ దొంగలు దోచుకుంటున్నారు. ఇప్పుడు స్థానిక పోలీసులకు ఇది ఓ సవాల్‌గా మారింది. కార్చిచ్చు కారణంగా జనాలను రక్షించడంతోపాటు ఇటు దొంగతనాలను అరికట్టాల్సి రావడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకూ దొంగతనాలకు పాల్పడుతున్న 29 మందిని అరెస్ట్ చేశారు. అందులోని ఓ వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా అగ్నిమాపక సిబ్బంది వేషం ధరించి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారందరినీ అరెస్ట్ చేశారు. దొంగతనాలను అరికట్టేందుకు షరీఫ్ డిపార్ట్మెంట్ గస్తీలను నిర్వహిస్తోంది.
24కు పెరిగిన కార్చిచ్చు మృతులు
వేగంగా వీస్తున్న గాలులతో మంటలు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో వేలాది ఇండ్లు కాలి బూడిదవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లుతోంది. ప్రాణనష్టం సైతం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. కార్చిచ్చులో మరణించిన వారి సంఖ్య 24కు పెరిగింది. మరణించిన వారిలో అత్యధికంగా ఏటోన్ ఫైర్లోనే 16 మంది కాగా, పాలిసేడ్స్‌లో 8 మంది ఉన్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ అగ్ని ప్రమాదాల్లో సుమారుగా 16 మంది తప్పిపోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. మంటల ధాటికి ఇప్పటి వరకూ 12,000 నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అంతేకాదు, పాలిసేడ్స్‌లో 23,707, ఏటోన్లో 14,117ఎకరాలు, కెన్నెత్‌లో 1,052, ముర్సెట్లో 779 ఎకరాలు దగ్ధమైనట్లు పేర్కొంది.
Also Read..
Wildfire | అమెరికా చరిత్రలోనే అత్యంత వినాశకరమైన ప్రకృతి వైపరీత్యం.. 24కు పెరిగిన కార్చిచ్చు మృతులు
Wildfire | అమెరికాలో ఆగని దావాగ్ని.. కమలా హారిస్ ఇంటికీ ముప్పు
కార్చిచ్చులకు 10 వేల నిర్మాణాలు ఆహుతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

