Wildfire | అమెరికాలో ఆగని దావాగ్ని.. కమలా హారిస్ ఇంటికీ ముప్పు
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో మంటలు అదుపులోకి రావడం లేదు. వేగంగా వీస్తున్న గాలులతో మంటలు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో వేలాది ఇండ్లు కాలి బూడిదవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తున్నది.
- లాస్ ఏంజెల్స్‌లో కొత్త ప్రాంతాలకు మంటలు వ్యాప్తి
- హాలీవుడ్ నటుల వల్ల మంటలార్పడంలో నీటి కొరత!
Wildfire | లాస్ ఏంజెల్స్, జనవరి 12: అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో మంటలు అదుపులోకి రావడం లేదు. వేగంగా వీస్తున్న గాలులతో మంటలు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో వేలాది ఇండ్లు కాలి బూడిదవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తున్నది. ప్రాణనష్టం సైతం పెరుగుతున్నది. శనివారం రాత్రికి మృతుల సంఖ్య 16కు పెరిగినట్టు అధికారులు తెలిపారు.
పాలిసేడ్స్, ఏటన్, కెన్నెత్, హర్ట్‌లో దాదాపు 62 చదరపు మైళ్ల మేర మంటలు వ్యాపించాయి. మంటలను ఆర్పేందుకు కాలిఫోర్నియాతో పాటు అమెరికాలోని తొమ్మిది నగరాలు, మెక్సికోకు చెందిన అగ్నిమాపక బృందాలు పని చేస్తున్నాయి. కాగా, లాస్ ఏంజెల్స్‌లో నివసించే హాలీవుడ్ నటులు వారికి కేటాయించిన నీటి కంటే ఎక్కువ వినియోగించుకున్నారని, దీంతో ఇప్పుడు మంటలు ఆర్పేందుకు నీటి కొరత ఏర్పడిందని మర్శలు వ్యక్తమవుతున్నాయి.
కమలా హారిస్ ఇంటికీ ముప్పు
కార్చిచ్చు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం పాలిసేడ్స్ అగ్ని బ్రెంట్వుడ్ వైపు మళ్లింది. ఈ ప్రాంతంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో పాటు పలువురు క్రీడాకారులు, నటీనటుల ఇండ్లు ఉన్నాయి. దీంతో ఉపాధ్యక్షురాలి హోదాలో చేయాల్సిన తన చివరి విదేశీ పర్యటనను కమలా హారిస్ రద్దు చేసుకున్నారు. మరోవైపు అమెరికాలోని టెక్సాస్, ఓక్లహోమా, మరికొన్ని రాష్ర్టాలను మంచు తుఫాను అతలాకుతలం చేస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRTU Won | యూనియన్ ఎన్నికల్లో బీఆర్టీయూ ఘన విజయం
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి హాజరు
‘ఏఐటీయూసీ పోరాట ఫలితం.. పీవీకే-5 కార్మికులకు సర్ఫేస్ కన్వర్షన్’
Out Side Food | బయటి ఆహారం తక్కువగా తినాలి లేదా పూర్తిగా మానేయాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Rajnath Singh | ముప్పు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. సైన్యానికి రక్షణ మంత్రి పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

