Abdulla Shahid: చిన్నారిపై లైంగిక వేధింపులు.. మాల్దీవులు మాజీ విదేశాంగ మంత్రి అరెస్టు
Abdulla Shahid: మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారిని లైంగికంగా వేధించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. కోర్టు వారెంట్ ప్రకారం రాత్రి 9.59 నిమిషాలకు మాజీ మంత్రి అబ్దుల్లాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మాలే: మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్(Abdulla Shahid)ను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నపిల్లలను లైంగికంగా వేధించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మాల్దీవు పోలీసులు సోమవారం దీనిపై ఓ ప్రకటన రిలీజ్ చేశారు. కోర్టు వారెంట్ ప్రకారం రాత్రి 9.59 నిమిషాలకు మాజీ మంత్రి అబ్దుల్లాను అరెస్టు చేసినట్లు చెప్పారు. గతంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్‌గా చేశారాయన. వాస్తవానికి 2028లో జరగబోయే దేశాధ్యక్ష ఎన్నికల్లో ఆయన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయాల్సి ఉన్నది. 64 ఏళ్ల అబ్ధుల్లా 18 లోపు ఉన్న చిన్నారిని లైంగికంగా వేధించినట్లు అనుమానాలు ఉన్నాయని, నవంబర్ 2వ తేదీన కోర్టు వారెంట్ ఆధారంగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నామని, ఈ కేసులో పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను షాహిద్ కొట్టిపారేశారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన గురించి చెడుగా ప్రచారం చేయరాదు అని ఆయన కోరారు.
మాల్దీవుల్లో ఉన్న రాజకీయవేత్తల్లో షాహిద్‌కు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్నది. 2018 నుంచి 2023 వరకు ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రిగా చేశారు. ఆ సమయంలో దేశాధ్యక్షుడిగా ఇబ్రహీం మొహమ్మద్ సోలి ఉన్నారు. 2021-22 మధ్య కాలంలో యూఎన్ జనరల్ అసెంబ్లీలో అధ్యక్షుడిగా చేశారు. పీపుల్స్ మజ్లీస్ స్పీకర్‌గా చేశారు. 2024 ఫిబ్రవరి నుంచి ఆగస్టు 2026 వరకు మాల్దీవుల డెమోక్రటిక్ పార్టీకి నాయకత్వం వహించారు. గతనెలలోనే ఢిల్లీలో జరిగిన లిటరేచర్ సదస్సుకు షాహిద్ హాజరయ్యారు.స్పేసెస్ వీ కాల్ హోమ్.. డయాస్పోరా అండ్ బిలాంగింగ్ అన్న అంశంపై ఆయన మాట్లాడారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
Tusshar Kapoor | రూ.5 కోట్లు ఇవ్వకుంటే లేపేస్తాం.. మరో బాలీవుడ్ నటుడికి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..!
Abdulla Shahid: చిన్నారిపై లైంగిక వేధింపులు.. మాల్దీవులు మాజీ విదేశాంగ మంత్రి అరెస్టు
AP News | తూర్పుగోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థుల హవా.. మూడు వార్డుల్లోనే వైసీపీ ఆధిక్యం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

