న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్‌తో స్నేహం కోసం ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తహతహలాడుతున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం వ్యాఖ్యానించారు. తన స్నేహితుడు మెక్రాన్ ఇప్పుడు చైనా చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారని విమర్శించారు. తాను వైట్‌హౌస్ వదిలిపెట్టాక ప్రపంచ దేశాలపై అమెరికా తన ప్రభావాన్ని కోల్పోయిందని తెలిపారు. అమెరికా విదేశాంగ విధానంలో చిక్కుకుపోకూడదని మెక్రాన్ తన చైనా పర్యటన ద్వారా యూరోపియన్ యూనియన్ను హెచ్చరించారు. తైవాన్‌పై తిరిగి ఆధిపత్యం సంపాదించాలని చైనా ప్రయత్నిస్తున్న తరుణంలో తైవాన్‌కు సాయం చేయాలని అమెరికా భావిస్తున్నది. ఈ తరుణంలో మెక్రాన్ బీజింగ్‌లో పర్యటించడం, తైవాన్ గురించి జిన్‌పింగ్‌తో చర్చించడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.