లండన్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు సుమారు 60 కిలోమీటర్ల పొడువైన రష్యా సైనిక కాన్వాయ్ ఆ నగరం దిశగా వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సేనలు నత్తనడకన సాగుతున్నట్లు బ్రిటన్ రక్షణ మంత్రి తెలిపారు. కీవ్ నగరానికి ఆ దండు ఇంకా సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ఉక్రెయిన్ యోధులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్న నేపథ్యంలో రష్యా సైనిక కాన్వాయ్ నెమ్మదిగా కదులుతోందని మంత్రి తెలిపారు. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. రష్యా వాహనశ్రేణిలో ఉన్న వాహనాలకు బ్రేక్‌డౌన్ అవుతోందని, అన్నీ ఒక్క దగ్గరికే చేరుకుంటున్నట్లు ఆయన అన్నారు. రష్యా భీకర దాడులు చేస్తున్నా.. ఖార్కివ్, చెర్నిహివ్, మారిపోల్ నగరాలు ఇంకా ఉక్రెయిన్ ఆధీనంలోనే ఉన్నట్లు ఆయన చెప్పారు. ఖేర్సన్ నగరంలోకి రష్యా బలగాలు ఎంటర్ అయినా.. అక్కడ సాయుధ దళాల పరిస్థితి తెలియదన్నారు. 498 మంది సైనికులు చనిపోయినట్లు రష్యా అంగీకరించిందన్నారు. మాక్సర్ టెక్నాలజీ కంపెనీ రష్యా సైనిక కాన్వాయ్కి చెందిన దృశ్యాలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.