న్యూఢిల్లీ : సింగర్ ఆస్ధా గిల్‌తో కలిసి ఓ చిన్నారి బాలిక స్టేజ్‌పై పాడిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆస్ధా గిల్‌తో ఖుషిక అనే బాలిక స్టేజ్ షేర్ చేసుకుని ఫేమస్ పసూరి సాంగ్ పాడిన వీడియో ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పడది వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో చిన్నారి ఖుషిక ఆత్మవిశ్వాసంతో స్టేజ్‌పైకి ఎక్కి ఆస్ధా గిల్‌తో కలిసి క్యూట్‌గా పాడటం నెటిజన్లను ఆకట్టకుంది. చిన్నారి పాటకు గిల్ సైతం ముగ్ధురాలై ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 3.6 లక్షల లైక్‌లు రాగా చిన్నారి పెర్ఫామెన్స్‌ను నెటిజన్లు ప్రశంసించారు.
తాను ఖుషికను ప్రేమిస్తున్నానని చెప్పండంటూ హార్ట్ ఎమోజీలతో ఆస్ధా గిల్ కామెంట్ చేశారు. కోక్ స్టూడియో పాకిస్తాన్ సీజన్ 14లో పసూరి పాట ప్రాచుర్యం పొందింది. ఈ పాటను అలి సేథి, షే గిల్ ఆలపించగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సాంగ్‌తో నెటిజన్లు ఇన్‌స్టాగ్రాంలో విపరీతంగా రీల్స్ చేస్తున్నారు.