అర్జెంటీనా విజయంతో మిన్నంటిన సంబురాలు : క్యూట్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్న చిన్నారి
ఫిఫా వరల్డ్ కప్ 2022 ట్రోఫీని అర్జెంటీనా గెలుచుకుని చరిత్ర సృష్టించగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలారు. అర్జెంటీనా గెలుపుతో రాజధాని బ్యూనోస్ఎయిర్స్లో ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి వేడుకలు జరుపుకున్నారు.
న్యూఢిల్లీ : ఫిఫా వరల్డ్ కప్ 2022 ట్రోఫీని అర్జెంటీనా గెలుచుకుని చరిత్ర సృష్టించగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలారు. అర్జెంటీనా గెలుపుతో రాజధాని బ్యూనోస్ఎయిర్స్లో ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి వేడుకలు జరుపుకున్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోనూ సెలబ్రేషన్స్ కొనసాగాయి.
He's got the moves .. celebrations galore #FIFAWorldCup2022 #WorldCup #Argentina vc-shared pic.twitter.com/U7QHG6tbhp
— Supriya Sahu IAS (@supriyasahuias) December 19, 2022
అర్జెంటీనా గెలుపు తర్వాత ఓ బాలుడు సంతోషంతో వీధుల్లో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో చిన్నారి అద్భుత ఎనర్జీతో డ్యాన్స్ చేస్తూ పలువురిని ఆకట్టుకున్నాడు. లియోనెల్ మెస్సీ ధరించిన నెంబర్ 10 జెర్సీతో చిన్నారి చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకర్షించింది.
బాలుడు చుట్టూ చేరిన పలువురు చప్పట్లు కొడుతూ అభినందిస్తుండగా చిన్నారి తనదైన క్యూట్ మూమెంట్స్‌తో చూపు తిప్పుకోకుండా చేశాడు. ఈ వీడియోను ఇప్పటివరకూ వేలాది మంది వీక్షించగా పెద్ద ఎత్తున నెటిజన్ంలు రియాక్టయ్యారు. సంతోషంతో గంతులేసిన చిన్నారిని యూజర్లు ప్రశంసించారు. అర్జెంటీనా జట్టుకు, మెస్సీకి ఈ కప్ ఎంతటి ప్రతిష్టాత్మకమో ఎపిక్ విన్ తెలిపిందని కామెంట్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

