సియోల్: దక్షిణ కొరియాలో మంగళవారం జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో లిబరల్ పార్టీ అభ్యర్థి లీ జే-మ్యుంగ్ 85 శాతానికిపైగా ఓట్లతో ఘన విజయం సాధించారు. ఆయన కన్జర్వేటివ్ ప్రత్యర్థి, పీపుల్స్ పవర్ పార్టీ అభ్యర్థి కిమ్ మూన్-సూ ఓటమిని అంగీకరించారు. 2024లో అప్పటి దేశాధ్యక్షుడు యూన్ సుక్ యూల్ విధించిన మార్షల్ లాపై ఇది ‘తీర్పు దినం’ అని లీ చెప్పారు. లీ నేతృత్వంలోని పార్లమెంటు యూన్‌ను నిరుడు డిసెంబరులో అభిశంసించింది.
పాక్‌లో భూకంపం.. 200 మంది ఖైదీలు పరారీ
న్యూఢిల్లీ: ‘ఆపదలో అవసరం’ అనే నానుడిని కరాచీలోని మలిర్ జైలు ఖైదీలు చక్కగా ఉపయోగించుకుని తప్పించుకున్నారు! వారం రోజులుగా కరాచీలో సంభవిస్తున్న స్వల్ప భూ ప్రకంపనలను అదనుగా భావించి 200 మందికి పైగా ఖైదీలు జైలు నుంచి బయటపడ్డారు. గత సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పారిపోయిన వారిలో మత్తు పదార్థాల సంబంధిత నేరాలకు పాల్పడినవారు ఉన్నారు. వారిలో చాలా మంది మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు.