Kamala Harris: నామినేషన్ స్వీకరించిన హ్యారిస్.. తల్లిని గుర్తు చేసుకున్న కమలా
Kamala Harris: డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ నామినేషన్ ఆమోదించారు. డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ స్వీకరించిన రెండో మహిళగా కమలా హ్యారిస్ నిలిచారు. కన్వెన్షన్‌లో హ్యారిస్ మాట్లాడుతూ తన తల్లి శ్యామలా గోపాలన్‌ను గుర్తు చేసుకున్నారు.
చికాగో: డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్(Kamala Harris) ఇవాళ నామినేషన్ స్వీకరించారు. చికాగోలో జరిగిన డీఎన్సీ మీటింగ్‌లో ఆమె నామినేషన్ ఆమోదించారు. డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ స్వీకరించిన రెండో మహిళగా కమలా హ్యారిస్ నిలిచారు. కన్వెన్షన్‌లో హ్యారిస్ మాట్లాడుతూ తన తల్లి శ్యామలా గోపాలన్‌ను గుర్తు చేసుకున్నారు. ప్రతి రోజూ తన తల్లిని మిస్ అవుతున్నట్లు ఆమె చెప్పారు.
గత కొన్నాళ్లుగా తాను వెళ్తున్న దారి అసాధారణమైందన్నారు. కానీ ఇలాంటి జర్నీలు కొత్తేమీ కాదన్నారు. తన తల్లి పైనుంచి చూస్తుంటుందని, ఆమె సంతోషంతో దీవిస్తుందని ఆశిస్తున్నట్లు హ్యారిస్ తెలిపారు. 19 ఏళ్ల వయసులో తన తల్లి దేశం దాటి వచ్చినట్లు గుర్తు చేశారు. బ్రెస్ట్ క్యాన్సర్ సైంటిస్టుగా కెరీర్ కోసం తన తల్లి ఇండియా నుంచి కాలిఫోర్నియా వచ్చినట్లు కమలా హ్యారిస్ వెల్లడించారు.
తన తల్లే తనను పెంచినట్లు ఆమె చెప్పారు. స్వంత ఇళ్లు కొనడానికి ముందు ఈస్ట్ బేలో ఓ చిన్న అపార్ట్మెంట్లో కిరాయికి ఉండేవాళ్లమని తెలిపారు. ఫ్లాట్ల్యాండ్స్ వద్ద ఉన్న తమ ఇంటి చుట్టూ ఫైర్‌ఫైటర్లు, నర్సులు, కన్స్ట్రక్షన్ వర్కర్లు కలగొలుపుగా ఉండేవారన్నారు. 19 ఏళ్ల వయసులో శ్యామలా గోపాలన్.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

