Journalist Sabrina Siddiqui | మోదీని ప్రశ్నిస్తే వేధింపులు.. ఆన్లైన్ వేదికగా జర్నలిస్టు సబ్రినా సిద్దిఖీకి బెదిరింపులు
అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత్‌లో మానవ హక్కులపై ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టు వేధింపులకు గురయ్యారు. పాకిస్థాన్ ఇస్లామిస్ట్ అంటూ ఆమెపై ముద్ర వేశారు. ఈ చర్యను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
Journalist Sabrina Siddiqui | న్యూయార్క్, జూన్ 27: అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత్‌లో మానవ హక్కులపై ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టు వేధింపులకు గురయ్యారు. పాకిస్థాన్ ఇస్లామిస్ట్ అంటూ ఆమెపై ముద్ర వేశారు. ఈ చర్యను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. యూఎస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బి దీనిపై స్పందించారు. ‘జర్నలిస్ట్‌పై వేధింపులకు పాల్పడడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. గతం వారం విలేకరుల సమావేశం సందర్భంగా మోదీ ప్రదర్శించిన ప్రజాస్వామ్య విలువలకు ఇది విరుద్ధమైన చర్య’ అని పేర్కొన్నారు.
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్ పెర్రీ మాట్లాడుతూ బైడెన్ పాలనలో అమెరికా ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉందన్నారు. అందుకే ప్రభుత్వం తరఫున విలేకరుల సమావేశం నిర్వహించామని తెలిపారు. వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెందిన సబ్రినా సిద్దిఖీ భారత్‌లో మైనారిటీలపై దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఈ ఘటన జరిగిన తర్వాతి రోజు నుంచే సదరు జర్నలిస్ట్‌పై వేధింపులు మొదలయ్యాయి. ఇప్పటికే భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పత్రికా స్వేచ్ఛను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని వస్తున్న విమర్శలకు ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తున్నది.
జర్నలిస్ట్‌కు అండగా ఎస్ఏజేఏ…
సౌత్ ఏషియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఎస్ఏజేఏ) వేధింపులను తీవ్రంగా ఖండించింది. ‘దక్షిణాసియాలోని మహిళా జర్నలిస్టులు వేధింపులకు గురవుతున్నారు. సిద్దిఖీకి అండగా ఉంటాం’ అని ఎస్ఏజేఏ తెలిపింది.
గుర్తింపును నిరూపించుకోవాల్సి వస్తున్నది…
ఆన్లైన్ వేధింపులపై సిద్ధిఖీ స్పందించారు. ‘కొంతమంది నన్ను టార్గెట్ చేస్తూ నా వ్యక్తిగత అంశాలను ఎంచుకుంటున్నారు. అటువంటి సమయాల్లో గుర్తింపును నిరూపించుకోవాల్సి వస్తున్నది. కొన్నిసార్లు గుర్తింపు అనేది… అది కనిపించే దాని కంటే కఠినంగా ఉంటుంది’ అని ఆమె ట్వీట్ చేశారు. 2011 క్రికెట్ ప్రపంచకప్ సమయంలో భారత జెర్సీని ధరించి తన తండ్రితో పాటు క్రికెట్ చూస్తున్న ఫొటోలను ఆమె ట్విట్టర్లో షేర్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

