దిలావర్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన దిలావర్లోని రెహోబోత్ బీచ్ వద్ద ఉన్న అట్లాంటిక్ థియేటర్లో ఓపెన్‌హైమర్(Oppenheimer) చిత్రాన్ని చూశారు. భార్య జిల్ బైడెన్‌తో కలిసి ఆ ఫిల్మ్‌ను చూసినట్లు వైట్‌హౌజ్ పేర్కొన్నది. క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఆ సినిమా ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలుకొడుతోంది. రెండు రోజుల క్రితం బీచ్‌లో షర్ట్‌లేకుండా సేద తీరినా జో బైడెన్.. సోమవారం ఓపెన్‌హైమర్ చిత్రాన్ని తిలకించారు. అయితే బార్బీ చిత్రానికి బదులుగా ఆయన ఓపెన్‌హైమర్‌ను ప్రిఫర్ చేసినట్లు తెలుస్తోంది.
వైట్‌హౌజ్‌లో కాకుండా పబ్లిక్ స్క్రీనింగ్‌లో బైడెన్ ఫిల్మ్‌ను చూడడం విశేషం. థియేటర్లో ఏడో వరుసలో ఆయన కూర్చున్నారట. మూడు గంటలు ఉన్న ఓపెన్‌హైమర్‌ను బైడెన్ దంపతులు ఓపిగ్గా చూశారు. అణు బాంబును డెవలప్ చేసిన జే రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవిత కథ ఆధారంగా నోలన్ ఆ చిత్రాన్ని తీశారు. ఓపెన్‌హైమర్ ఫిల్మ్ చాలా ప్రేరణాత్మకంగా ఉందని బైడెన్ అన్నారు. 2020 ఎన్నికల కేసులో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై మూడోసారి నేరాభియోగాలు నమోదు అయిన రోజునే బైడెన్ సినిమా చూశారని కొందరు ఆన్లైన్లో ట్రోల్ చేస్తున్నారు.