టోక్యో, జూలై 27 : ప్రపంచంలోని వివిధ దేశాలు నిర్వహిస్తున్న రోదసి ప్రయోగాల వల్ల దిగువ భూకక్ష్యలో వ్యర్థాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు జపాన్ శాస్త్రవేత్తలు సులభమైన పరిష్కారాన్ని చూపారు. అదే ‘పేపర్ ప్లేన్’ (కాగితపు విమానం). ఇదేమీ జోక్ కాదు. టోక్యో యూనివర్సిటీ పరిశోధకులు ఏ4 షీట్‌తో ఓ పేపర్ ప్లేన్‌ను తయారు చేసి, సిమ్యులేషన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఎగురవేశారు.
అంతరిక్ష నౌకల నిర్మాణానికి పూర్తిగా లోహాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని, సాధారణ పేపర్ షీట్‌తో కూడా వాటిని తయారు చేసుకోవచ్చని ఈ అధ్యయనం వాదిస్తున్నది. కాగితంతో తయారైన వ్యోమనౌకల వల్ల వ్యర్థాలు ఉత్పన్నం కావని పేర్కొంది.
30న నిసార్ ఉపగ్రహ ప్రయోగం
హైదరాబాద్, జూలై 27 (నమస్తేతెలంగాణ) : శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 30న సాయంత్రం 5:40 గంటలకు నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఈ శాటిలైట్‌ను నాసా-ఇస్రో సంయుక్తంగా రూపొందించాయి.
2,392 కిలోల బరువున్న ఈ శాటిలైట్‌ను జీఎస్ఎల్వీ ఎఫ్-16 రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపించనున్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగం కోసం ఎస్డీఎస్ఎస్లో అన్ని ఏర్పాట్లు చేశారు.