టోక్యో, నవంబర్ 4: తనను తాను రిపేర్ చేసుకొనే, పాక్షికంగా బయో డీగ్రేడబుల్ అయ్యే ప్లాస్టిక్‌ను జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని వేడిచేసిన తర్వాత కావాల్సిన రూపంలోకి మార్చుకోవచ్చు. పర్యావరణ హిత ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో జపాన్‌కు చెందిన టోక్యో యూనివర్సిటీ పరిశోధకులు వ్రిటిమర్ ఎపోక్సీ రెజీన్ ఆధారంగా సరికొత్త ప్లాస్టిక్ రూపొందించారు. ఇది సాధారణ ప్లాస్టిక్ కంటే బలంగా ఉంటుంది. అంతేకాదు తనకు తాను మరమ్మతు చేసుకుంటుంది. సముద్ర జలాల్లో కలిస్తే బయోడీగ్రేడబుల్ అయ్యి సముద్ర జీవులకు ఆహారం అవుతుంది.