గురువారం 04 జూన్ 2020
International - Apr 08, 2020 , 09:05:25

క‌రోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఇట‌లీ

క‌రోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఇట‌లీ

క‌రోనాతో క‌కావిక‌ల‌మైన ఇట‌లీ ఇప్పుడిప్పుడే కాస్తా కుదుట‌ప‌డుతుంది. వైర‌స్ వ్యాప్తితో తీవ్ర విషాదాన్ని ఎదుర్కొన్న అక్క‌డి ప్ర‌జ‌లు ఆ విషాదం నుంచి కాస్తా బ‌య‌ట‌ప‌డుతున్నారు. గ‌త వారం పోలిస్తే ఈ వారం కొత్త కేసుల సంఖ్య న‌మోదు చాలా వ‌ర‌కు త‌గ్గింది. ఇంకా మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గ‌డ‌మే కాకుండా ఆస్ప‌త్రిలో చేరుతున్న కొత్త  క‌రోనా రోగుల సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గింది. అంతేకాదు ఐసీయూలోని కరోనా పేషంట్ల సంఖ్య త‌గ్గ‌డం, క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్న పేషెంట్ల సంఖ్య పెరుగుతుండ‌టం ఊర‌ట‌నిచ్చే అంశం. మొత్తానికి క‌రోనా ఇట‌లీలో క‌రోనా విజృంభించ‌డం కాస్తా సంతోషించాల్సిన విష‌య‌మేన‌ని అక్క‌డి అధికారులు పేర్కొంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కేసులు 1,35,586 ఉండ‌గా 17,127 క‌రోనాతో మ‌ర‌ణించారు. 


logo