టెల్ అవీవ్, నవంబర్ 23 : హెజ్బొల్లా చీఫ్ ఆఫ్ స్టాఫ్ లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. హారెట్ హ్రీక్లోని తొమ్మిది అంతస్తుల నివాస అపార్ట్మెంట్ భవనంపై జరిగిన ఈ దాడిలో ఐదుగురు మరణించగా, 28 మంది గాయపడ్డారు.
ఇక్కడ ఇజ్రాయెల్ దాడి చేయడం స్థానిక నివాసితులలో భయాందోళన రేకెత్తించిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. సంస్థ సైనిక నిర్మాణం, పునర్ వ్యవస్థీకరణకు బాధ్యత వహించిన హెజ్బొల్ల్లా చీఫ్ ఆఫ్ స్టాప్ అలీ టబ్తాబాయ్పై తమ ఐడీఎఫ్ దళాలు దాడి చేశాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అయితే ఈ దాడిలో అతడు మరణించినదీ, లేనిదీ నిర్ధారించ లేదు.