Israel- Hamas War | హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ మలి విడత పోరు..రణక్షేత్రంగా మారిన గాజా
హమాస్ (Israel- Hamas War) లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెలీ దళాలు విరుచుకుపడుతున్నాయి.
జెరూసలెం : హమాస్ (Israel- Hamas War) లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెలీ దళాలు విరుచుకుపడుతున్నాయి. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌తో ఇజ్రాయెల్ భీకర యుద్ధం ఆదివారం 23వ రోజుకు చేరగా హమాస్‌ను తుదముట్టించేందుకు ఇజ్రాయెల్ భద్రతా బలగాలు (ఐడీఎఫ్) మలి దశ యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. భూతల ఆపరేషన్స్‌లో భాగంగా 150 సొరంగాలు, బంకర్స్ సహా 150 హమాస్ స్ధావరాలే లక్ష్యంగా ముందుకు కదులుతున్నామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
గాజా రణక్షేత్రంగా మారిందని ఉత్తర గాజా పౌరులను ఐడీఎఫ్ హెచ్చరించింది. ఈ ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులు, ఉగ్ర మూక స్ధావరాలు, మౌలిక వసతుల విధ్వంసమే లక్ష్యంగా ఐడీఎఫ్ విరుచుకుపడుతోంది. గాజాలో హమాస్‌పై రెండవ దశ యుద్ధాన్ని తమ దళాలు చేపట్టాయని ఇజ్రాయల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు టెల్ అవీవ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
ఉపరితలంలో, గగనతలంలో శత్రువును తుదముట్టించేందుకు శత్రు మూకలను వెంటాడుతున్నామని వెల్లడించారు. హమాస్‌తో యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఇజ్రాయెల్ మనుగడ కోసం పోరాడుతున్నామని తేల్చిచెప్పారు. గాజాలో మలి విడత భూతల దాడులు దీర్ఘకాలం కొనసాగుతాయని తెలిపారు. హమాస్‌ను అంతమొందించే వరకూ పోరాటం కొనసాగించి విజేతలుగా నిలుస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు.
Read More :
Viral News | రీల్స్ చేసే మొగుడు కావాలి.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అమ్మాయి పెండ్లి ప్రకటన
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

