ఇజ్రాయెల్‌లో రికార్డు పోలింగ్
ప్రధాని నెతన్యాహు, ఆయన ప్రధాన ప్రత్యర్థి, మాజీ సైన్యాధిపతి ఐసెన్కోట్ల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని సర్వేలు అంచనా వేస్తున్న తరుణంలో మంగళవారం ఇజ్రాయెల్‌లో జరిగిన కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల సమయానికి సుమారు 67 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- 50 ఏండ్లలో అత్యధిక ఓటింగ్
- నెతన్యాహుకు గట్టి పోటీ ఇస్తున్న మాజీ సైన్యాధిపతి ఐసెన్‌కోట్
జెరూసలెం : ప్రధాని నెతన్యాహు, ఆయన ప్రధాన ప్రత్యర్థి, మాజీ సైన్యాధిపతి ఐసెన్కోట్ల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని సర్వేలు అంచనా వేస్తున్న తరుణంలో మంగళవారం ఇజ్రాయెల్‌లో జరిగిన కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల సమయానికి సుమారు 67 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1973 ఎన్నికల తర్వాత ఇదే అత్యధిక ఓటింగ్ శాతం. పోలింగ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాత్రి 10 గంటలకు ముగియనున్న ఈ ప్రక్రియలో 12,018 పోలింగ్ కేంద్రాల ద్వారా 73,31,981 మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇజ్రాయెల్‌లో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నెతన్యాహు, ఆయన భార్య సారా జెరూసలెంలోని ఒక పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. గట్టి పోటీని ఎదుర్కొంటున్న నెతన్యాహు ‘అరబ్ పార్టీల ప్రభుత్వం’ ఏర్పడకుండా ఉండేందుకు మితవాద ఓటర్లు మేల్కొని తన లికుడ్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. 2015 ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే ఆయన మళ్లీ అమలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఒక స్పష్టమైన సంకేతం బుధవారం వెలువడే అవకాశం ఉంది. మీడియా కథనాల ప్రకారం సుమారు 80 వేల మంది ఇజ్రాయెలీలు ఓటేసేందుకు విదేశాల నుంచి వచ్చారు. దేశ భవిష్యత్తును నిర్ణయించగల ఎన్నికలుగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ఓటు వేయడమే వారి రాకకు ప్రధాన కారణం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తెలంగాణ వర్కర్స్ యూనియన్ సూర్యాపేట డిపో నూతన కమిటీ ఎన్నిక
Saatvika Veeravalli | టెకీ నుంచి టాలీవుడ్ హీరోయిన్గా.. ‘ఆకాశంలో ఒక తార’ విశేషాలు పంచుకున్న నటి సాత్విక వీరవల్లి!
CV anand | తెలంగాణ గ్రేహౌండ్స్ దేశానికే ఆదర్శం : డీజీపీ సీవీ ఆనంద్
Threaten To Kill Commander, Jawan Sacked | కమాండర్‌ను చంపుతానని సోషల్ మీడియాలో బెదిరింపు.. జవాన్ తొలగింపు
Scholar | యువతను ఆకట్టుకునేలా ‘స్కాలర్’ ఫస్ట్ లుక్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

