Israel–Hezbollah | హెజ్బొల్లా రహస్య బంకర్లో.. భారీగా బంగారం, నోట్ల గుట్టలు.. వీడియో
Israel–Hezbollah | హెజ్బొల్లా రహస్య బంకర్‌ను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఓ ఆస్పత్రి కింద ఉన్న బంకర్లో భారీగా బంగారం, నోట్ల గుట్టలు ఉన్నట్లు ఇజ్రాయెల్ ధృవీకరిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది.
Israel–Hezbollah | హెజ్బొల్లా రహస్య బంకర్‌ను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఓ ఆస్పత్రి కింద ఉన్న బంకర్లో భారీగా బంగారం, నోట్ల గుట్టలు ఉన్నట్లు ఇజ్రాయెల్ ధృవీకరిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. హమాస్ అధినేత యాహ్వా సిన్వర్‌ను హతమార్చిన నేపత్యంలో ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు దిగుతామని లెబనాన్‌లోని హెజ్బొల్లా ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్.. హెజ్బొల్లా ఆర్థిక మూలాలను లక్ష్యంగా చేసుకుంది. ఓ ఆస్పత్రి కింద ఉన్న రహస్య సొరంగంలో మిలిటెంట్ గ్రూప్‌నకు సంబంధించి భారీగా బంగారం, నోట్ల గుట్టలు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని ఐడీఎఫ్ సంచలన వీడియో విడుదల చేసింది.
ఈ మేరకు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ మాట్లాడుతూ.. హెజ్బొల్లా ఆర్థిక వనరులపై వరుసగా దాడులకు పాల్పడుతున్నాం. ఆదివారం రాత్రి జరిపిన దాడుల్లో ఓ బంకర్‌ను ధ్వంసం చేశాం. ఆ రహస్య బంకర్లో భారీగా బంగారం, వేల డాలర్ల నగదును గుర్తించాం. ఇజ్రాయెల్‌పై దాడులకు ఈ నగదునే వినియోగిస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ మిలిటెంట్ గ్రూప్‌నకు బీరుట్ నడిబొడ్డున మరో రహస్య బంకర్ ఉంది. అల్ – సాహెల్ ఆస్పత్రి కింద ఉన్న ఆ రహస్య బంకర్లో వందల మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగారం గుట్టలు ఉన్నట్లు తెలిసింది. ఆ బంకర్‌పై ఇంకా తాము దాడులకు పాల్పడలేదు. ఆ బంకర్లో 500 బిలియన్ డాలర్ల నగదు(రూ. 4,200 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా వేస్తున్నాం అని హగారీ పేర్కొన్నారు.
బంకర్ ఉన్న ప్రాంతంలోని ఆస్పత్రిపై దాడులకు పాల్పడమని, తమ యుద్ధం కేవలం హెజ్బొల్లాతో మాత్రమే అని హగారీ స్పష్టం చేశారు. లెబనీస్ పౌరులకు ఎలాంటి హానీ కలిగించమని పేర్కొన్నారు. మొత్తానికి ఈ పరిణామాల నేపథ్యంలో ఆస్పత్రిని అధికారులు ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం.
“Tonight, I am going to declassify intelligence on a site that we did not strike—where Hezbollah has millions of dollars in gold and cash—in Hassan Nasrallah’s bunker. Where is the bunker located? Directly under Al-Sahel Hospital in the heart of Beirut.”
Listen to IDF Spox.… pic.twitter.com/SjMZQpKqoJ
— Israel Defense Forces (@IDF) October 21, 2024
ఇవి కూడా చదవండి..
Britain’s King Charles | మీరు మా రాజు కాదు.. ఆస్ట్రేలియా పార్లమెంట్లో బ్రిటన్ రాజుకు అవమానం
China | మరణించిన వారితో ముచ్చట్లు.. చైనాలో ఏఐ ఆధారిత ‘డెడ్‌బోట్‌లు’
నవంబర్ 1-19 మధ్య ఎయిర్ ఇండియాలో ప్రయాణించొద్దు
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Al-Sahel Hospital
- Beirut
- gold
- Hamas
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

