టెహ్రాన్ : ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతల సమయంలో తమకు మద్దతుగా నిలిచి సాయం చేస్తున్న దేశాలతో విస్తృత సంప్రదింపులు జరిపేందుకు ఇరాన్ ‘కృతజ్ఞతల భాష’ ఎంచుకున్నట్టుంది! తాజాగా ఇజ్రాయెల్‌పై తాను ప్రయోగించిన క్షిపణులపై ‘భారత ప్రజలకు కృతజ్ఞతలు’ అని రాశామని తెలిపే వీడియోను ముంబైలోని ఆ దేశ ఎంబసీ ఎక్స్‌లో షేర్ చేసింది.
ఇదే తరహాలో స్పెయిన్, పాకిస్థాన్, జర్మనీ ప్రజలకు థ్యాంక్స్ చెబుతూ ప్రయోగానికి ముందు ఆ కృతజ్ఞత సందేశాలను క్షిపణులపై ఇరాన్ సైన్యం రాసింది. భారత ప్రజల నుంచి ముఖ్యంగా కశ్మీరీల నుంచి ఇరాన్ ప్రభుత్వానికి మానవతా సాయంగా డబ్బు, నగలు, వివిధ వస్తువులు ఇటీవల అందాయి. ఈ నేపథ్యంలోనే భారత పౌరులకు ఇరాన్ కృతజ్ఞతలు తెలిపినట్టు తెలుస్తున్నది.