Rain : హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల తర్వాత ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వాన మొదలైంది. ఊహించని వర్షంతో పలు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
రాజధానిలోని బంజారాహిల్స్, పంజాగుట్ట, బోయిన్ పల్లి, ప్యారడైజ్, బేగంపేట్, అల్వాల్, మచ్చబొల్లారం, ముషీరాబాద్, బాగ్లింగం పల్లి, అంబర్పేట్, కవాడిగూడ, కాచిగూడ, మియాపూర్, చందానగర్, బోడుప్పల్లో భారీ వాన పడింది. తార్నాకలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అబ్దుల్లాపూర్మెట్, శామీర్పేట్ మండలాల్లోనూ పెద్ద వానే కురిసింది.
“#Hyderabad: Heavy rains lash Alwal, Macha Bollarum & Shamirpet areas! #HyderabadRains #WeatherUpdate” pic.twitter.com/S4LXioueZw
— RSB NEWS 9 (@ShabazBaba) March 27, 2026