Iran–US | అమెరికాతో చర్చలు నిలిపివేసిన ఇరాన్.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులే కారణం
Iran–US : అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు కొలిక్కిరావడం లేదు. తాజాగా అమెరికాతో చర్చల్ని ఇరాన్ నిలిపివేసినట్లు సమాచారం. ఇరాన్ మిత్రదేశమైన లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుసగా దాడులు చేస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
Iran–US : అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు కొలిక్కిరావడం లేదు. తాజాగా అమెరికాతో చర్చల్ని ఇరాన్ నిలిపివేసినట్లు సమాచారం. ఇరాన్ మిత్రదేశమైన లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుసగా దాడులు చేస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఇరాన్‌కు చెందిన తన్సిమ్ అనే మీడియా సంస్థ కొన్ని విషయాల్ని వెల్లడించింది. ఇరాన్ సైనిక విభాగం అయిన ఐఆర్‌జీసీతో తన్సిమ్ సంస్థ కలిసి పని చేస్తుంటుంది. తన్సిమ్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాతో చర్చల్ని ప్రస్తుతానికి ఇరాన్ నిలిపివేసింది.
లెబనాన్ వంటి తమ మిత్రపక్షాలపై ఇజ్రాయెల్ దాడులు ఆపనంతవరకు, వారి సూచనల్ని పరిగనణలోకి తీసుకోనంత వరకు చర్చలు జరిపేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. అమెరికాతో ఒక పక్క చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్‌పై దాడులు చేస్తూనే ఉంది. సోమవారం లెబనాన్ రాజధాని బీరుట్ పరిసర ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. నిజానికి ఇప్పటికే లెబనాన్‌పై ఇజ్రాయెల్ పట్టుసాధించినట్లు తెలుస్తోంది. లెబనాన్ భూభాగంలోకి ఇజ్రాయెల్ దళాలు చొచ్చుకెళ్లాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ దక్కించుకుంది.
లెబనాన్‌పై దాడులు చేయాల్సిందిగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ఆదేశించారు. లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా వరుసగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటం వల్లే తాము దాడులు చేస్తున్నామని ప్రకటించింది. ఇదే సమయంలో హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేసింది. అక్కడి తీర ప్రాంతమైన హైఫా ప్రాంతంలో దాడులు చేసినట్లు తెలుస్తోంది. అయితే, హెజ్బొల్లా దాడుల్ని తాము తిప్పికొట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడుల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇక, ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ శాంతి చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయో చూడాలి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- iran
- Israel
- Lebanon
- Peace talks
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

