శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 22, 2020 , 13:24:57

మిలిట‌రీ శాటిలైట్‌ను క‌క్ష్య‌లోకి పంపిన ఇరాన్‌

మిలిట‌రీ శాటిలైట్‌ను క‌క్ష్య‌లోకి పంపిన ఇరాన్‌

హైద‌రాబాద్‌: మిలిట‌రీ ఉప‌గ్ర‌హాన్ని అత్యంత విజ‌య‌వంతంగా ఇరాన్ క‌క్ష్య‌లోకి పంపింది.  ఇరాన్స్ రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ ఈ శాటిలైట్‌ను ప్ర‌యోగించారు.  టూ స్టేజ్ కెరీర్ లాంచ‌ర్‌ నుంచి నూర్ శాటిలైట్‌ను నింగికి పంపిన‌ట్లు ఐఆర్జీసీ పేర్కొన్న‌ది. ఇదో గొప్ప విజ‌య‌మ‌ని, ఈ శాటిలైట్ ప్ర‌యోగంతో ఇరాన్ అంత‌రిక్ష సామ‌ర్థ్యం పెర‌గ‌నున్న‌ట్లు ఐఆర్జీసీ తెలిపింది.  అమెరికాతో గ‌ల్ఫ్ విష‌యంలో ఉద్రిక్త‌త‌లు ఉన్న నేప‌థ్యంలో ఇరాన్ ఈ ప‌రీక్ష చేప‌ట్టింది. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ వ‌ల్ల కూడా ఇరాన్‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తూనే ఉన్నాయి.  మిస్సైళ్లు అభివృద్ధి చేస్తున్న ఇరాన్‌.. శాటిలైట్ ప‌రీక్ష పేరుతో అబ‌ద్దాల‌ను క‌ప్పిపుచ్చుతోంద‌ని అమెరికా ఆరోపించింది.

గ‌ల్ఫ్ తీరంలో ఉన్న త‌మ నౌక‌ను ఇరాన్ ద‌ళాలు వేధిస్తున్న‌ట్లు ఇటీవ‌ల అమెరికా పేర్కొన్న‌ది. మ‌ర్కాజీ ఎడారి నుంచి ప్ర‌స్తుత నూర్ ఉప‌గ్ర‌హాన్ని లాంచ్ చేశారు. 425 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న భూక‌క్ష్య‌లో శాటిలైట్‌ను ప్లేస్ చేశారు.  రెండు నెల‌ల క్రిత‌మే ఓ శాటిలైట్‌ను ప్ర‌యోగించినా అది క‌క్ష్య‌లోకి వెళ్ల‌లేదు. దీంతో ఇరాన్ మ‌ళ్లీ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే మ‌రోప‌రీక్ష‌ను చేప‌ట్టింది.  ఫిబ్ర‌వ‌రి 9వ తేదీన జాఫ‌ర్ అనే శాటిలైట్‌ను ప్ర‌యోగించింది.  ఇటీవ‌ల మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఖాసిమ్ సొలేమానిని హ‌త్య చేసిన త‌ర్వాత అమెరికా, ఇరాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు తారాస్థాయికి చేరాయి. ఇక ఇప్పుడు శాటిలైట్ ప‌రీక్ష‌ల‌తో ఇరాన్‌పై అమెరికా మ‌రింత ఆగ్ర‌హంగా ఉన్న‌ది.logo