టెహ్రాన్: మొహమ్మద్ ప్రవక్తను అవమానించాడని.. పాప్ సింగర్(Iran Pop Singer) ఆమిర్ హుస్సేన్ మగ్‌సౌద్లూకు ఇరాన్ కోర్టు మరణశిక్ష విధించింది. సింగర్ ఆమిర్‌ను టట్లూగా కూడా పిలుస్తారు. దేశద్రోహానికి పాల్పడినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇదే కేసులో అయిదేళ్ల జైలు శిక్ష పడింది. అయితే ప్రాసిక్యూటర్ అభ్యంతరాలను సుప్రీంకోర్టు ఆమోదించింది. కేసును రీఓపెన్ చేసి, సింగర్ ఆమిర్‌కు శిక్షను ఖరారు చేశారు. ప్రవక్తను అవమానించిన ఘటనలో ఆమిర్‌కు మరణశిక్ష విధిస్తున్నట్లు కోర్టు చెప్పింది. అయితే ఆ తీర్పును సింగర్ అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు.
37 ఏళ్ల మ్యూజిక్ సింగర్.. 2018 నుంచి ఇస్తాంబుల్‌లో రహస్యంగా ఉంటున్నాడు. అయితే డిసెంబర్ 2023లో అతన్ని టర్కీ పోలీసులు ఇరాన్‌కు అప్పగించారు. అప్పటి నుంచి అతను ఇరాన్ కస్టడీలోనే ఉన్నాడు. వ్యభిచారాన్ని ప్రోత్సహించిన కేసులో సింగర్ టట్లూకు పదేళ్ల శిక్ష పడింది. మరో కేసులో ఇస్తామ్కు వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు కూడా శిక్ష వేశారు.