Home
International
Iran Actress Taraneh Alidoosti Who Arrested For Anti Hijab Protest Gets Bail After 18 Days
హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు.. 18 రోజుల తర్వాత ఇరాన్ నటికి బెయిల్
Taraneh Alidoosti | హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఇరాన్ నటి తరనేహ్ అలిదస్తీ (Taraneh Alidoosti) ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయింది. మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి
టెహ్రాన్: హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఇరాన్ నటి తరనేహ్ అలిదస్తీ (Taraneh Alidoosti) ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయింది. మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉధృతంగా ఆదోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. గత డిసెంబర్లో నటి అలిదస్తీ కూడా ఆందోళల్లో పాల్గొన్నారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అయితే 18 రోజుల తర్వాత ఆమెకు అధికారులు బెయిల్ మంజూరు చేశారు. దీంతో సినీనటి జైలు నుంచి విడుదలైనట్లు ఆమె న్యాయవాది తెలిపారు.

2016 ఆస్కార్ గెలుపొందిన ‘ది సేల్స్‌మ్యాన్’ సినిమాలో అలిదస్తీ నటించారు. పలు టీవీ షోలలో కూడా కనిపించారు. గతంలో ఇరాన్ సినీ పరిశ్రమలో జరిగిన మీటూ ఉద్యమంలో అలిదస్తీ పాల్గొన్నారు. ఆమెను జైలు నుంచి విడుదల చేయాలని ప్రపంచ వ్యాప్తంగా 600 మంది నటీనటులు బహిరంగ లేఖపై సంతకాలు చేశారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

