న్యూయార్క్: సిలికాన్ వ్యాలీ(Silicon Valley) దిగ్గజం, ప్రముఖ దాత గోర్డన్ మూర్(Gordon Moore) కన్నుమూశారు. ఆయన వయసు 94 ఏళ్లు. హవాయిలో ఆయన తుది శ్వాస విడిచారు. 1950 దశకంలో ఆయన సెమీకండక్టర్ల వ్యాపారం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన ఇంటెల్ కార్పొరేషన్(Intel Corporation) సంస్థను స్థాపించారు. ప్రతి ఏడాది కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్స్ రెట్టింపు అవుతుందని ఆయన అంచనా వేశారు.
సెమీకండక్టర్స్ వ్యాపారం కోసం ఆయన ఆ రోజుల్లో కొత్త రూల్స్ రూపొందించారు. కంప్యూటర్ ప్రాసెసర్(computer processor) ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. పీసీ రెవల్యూషన్లో ఆయన పాత్ర ప్రత్యేకమైంది. మెమోరీ చిప్స్ తయారీలోనూ మూర్ తనదైన ముద్ర వేశారు.