Cancer | మిచిగాన్ (అమెరికా): ఇమ్యూన్ బేస్డ్ క్యాన్సర్ చికిత్స అనంతరం తీవ్రమైన గ్యాస్ట్రోఇంటెస్టినల్ (జీర్ణ వ్యవస్థ సంబంధిత) సమస్యలు వస్తాయని యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ హెల్త్ రోగెల్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు గుర్తించారు. దీంతె అవాంఛనీయ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స చేసే ఇమ్యునో థెరపీ పద్ధతిని కనుగొన్నారు. సీనియర్ స్టడీ ఆథర్ గాబ్రియెల్ నునెజ్ మాట్లాడుతూ, మెకానిజాన్ని అర్థం చేసుకోవడం వల్ల మరింత ప్రయోజనాత్మకమైన ప్రత్యామ్నాయ థెరపీని అభివృద్ధి చేయగలమనేదానికి ఇదొక ఉదాహరణ అని తెలిపారు.
క్యాన్సర్ ఇమ్యునో థెరపీ వల్ల పెద్ద పేగులో మంట పుట్టడానికి కారణమయ్యే మెకానిజాన్ని తాము గుర్తించామని, అనంతరం ఈ సమస్యను అధిగమించడానికి అవసరమైన మార్గాలను అభివృద్ధి చేశామని చెప్పారు. యాంటీ ట్యూమర్ ఎఫెక్ట్ను పరిరక్షిస్తూనే పెద్ద పేగులో మంటను నిరోధించే విధానాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు.