ఎట్టెట్టా.. సెల్ఫీలు అమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చా.. అనే డౌట్ మీకు టైటిల్ చదవగానే వచ్చి ఉంటుంది. అవును.. సెల్ఫీలు అమ్మి కూడా కోట్లు సంపాదించవచ్చని నిరూపించాడు ఇండోనేషియాకు చెందిన స్టూడెంట్ సుల్తాన్ గస్తఫ్. అతడు ఒక కాలేజీ స్టూడెంట్. కానీ.. ఇప్పుడు అక్కడ స్థానికంగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. దానికి కారణం.. కేవలం సెల్ఫీలు అమ్మి కోట్లు గడించడమే.
తన సెల్ఫీలకు చెందిన డిజిటల్ రైట్స్‌ను 1 మిలియన్ డాలర్లకు అమ్మేశాడు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.7.5 కోట్లు అన్నమాట. సెమరాంగ్‌లో ఉన్న యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న సుల్తాన్ గస్తఫ్ ఘజోలీ ఎవ్రీడే పేరుతో నాన్ ఫంగిబుల్ టోకెన్స్(ఎన్ఎఫ్టీఎస్) ప్లాట్ఫామ్లో తన సెల్ఫీ ఫోటోలను అప్లోడ్ చేశాడు.
గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి రోజు తన సెల్ఫీ తీసుకొని అందులో అప్లోడ్ చేయడం ప్రారంభించాడు. అలా ఇప్పటి వరకు కనీసం ఒక వెయ్యి సెల్ఫీలు తీసుకున్నాడు. వాటితో తన గ్రాడ్యుయేషన్ డే రోజుల టైమ్‌లాప్స్ వీడియోను చేయడానికి కూడా సుల్తాన్ సిద్ధమయ్యాడు. ఎన్ఎఫ్టీలో తన ఫోటోల డిజిటల్ రైట్స్‌ను అమ్మేసి కోట్లు కూడబెట్టేశాడు.
It's been 3 days and left 331 NFT
— Ghozali_Ghozalu (@Ghozali_Ghozalu) January 12, 2022
sold out now because for the next few years I won't be listing
You can do anything like flipping or whatever but please don't abuse my photos or my parents will very disappointed to me
I believe in you guys so please take care of my photos. pic.twitter.com/oyGGR2Aben
అసలు నా ఫోటోలను కొంటారని నేను కలలో కూడా ఊహించలేదు. అందుకే ఒక ఫోటోకు కేవలం 3 డాలర్లు మాత్రమే కోట్ చేశాను. తన ఫోటోలకు అంత డబ్బు పెట్టి కొన్న వాళ్లకు ఈ సందర్భంగా సుల్తాన్ థ్యాంక్స్ చెప్పాడు. నా ఫోటోలను ఏదైనా చేసుకోండి కానీ వాటిని అశ్లీలంగా మాత్రం చేయకండి. ఎందుకంటే.. మా పేరెంట్స్‌కు తెలిస్తే వాళ్లు బాధపడతారు.. అంటూ మరో ట్వీట్లో సుల్తాన్ చెప్పుకొచ్చాడు.