లండన్ : బ్రిటన్‌లో జాతి ద్వేషంతో ఓ భారతీయ యువతిపై లైంగిక దాడి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో శనివారం రాత్రి 20 ఏళ్ల భారతీయ యువతి వీధిలో పడి ఉండటాన్ని కొందరు గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, బాధితురాలిని ఓ శ్వేత జాతీయుడు (32) పార్క్ హాల్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి లాక్కెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ దాడికి కారణం ఆమె విదేశీయురాలు కావడమేనని పోలీసులు విశ్వసిస్తున్నారు. నిందితుడిని వల్సల్, పెర్రీ బార్ల్రో సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ పోలీసులు తెలిపారు.