న్యూయార్క్ : అమెరికాలోని న్యూయార్క్ సిటీకి మేయర్‌గా పోటీ పడేందుకు భారత సంతతి వ్యక్తి ప్రైమరీ ఎన్నికల్లో గెలిచాడు. డెమోక్రటిక్ పార్టీ తరనపు జోరన్ మామ్దానీ(Zohran Mamdani) .. న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా పోటీచేయనున్నారు. అతని వయసు 33 ఏళ్లు. ఉగాండాలోని కంపాలలో భారతీయ సంతతి పేరెంట్స్‌కు 1991, అక్టోబర్ 18వ తేదీను జోరన్ జన్మించారు. జోరన్కు అనుకూలంగా 80 శాతం వరకు ఓట్లు పోలయ్యాయి. అతని తండ్రి మహమూద్ మామ్దానీకి భారతీయ మూలాలు ఉన్నాయి. కొలంబియా యూనివర్సిటీలో అతను ప్రొఫెసర్‌గా చేశారు. తల్లి ఫిల్మ్‌మేకర్ మీరా నాయర్. ఆమెకు పంజాబీ మూలాలు ఉన్నాయి. ఒకవేళ మామ్దానీ న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైతే, ఆ పోస్టులో ఉన్న తొలి ముస్లింగా రికార్డు సృష్టిస్తాడు. మేయర్‌గా మారిన తొలి ఇండో అమెరికన్‌గా కూడా అతనే నిలుస్తాడు.
In the words of Nelson Mandela: it always seems impossible until it’s done.
My friends, it is done. And you are the ones who did it.
I am honored to be your Democratic nominee for the Mayor of New York City. pic.twitter.com/AgW0Z30xw1
— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) June 25, 2025
మేయర్ అభ్యర్థి రేసులో డెమోక్రటిక్ పార్టీకి చెందిన కీలక నేత ఆండ్రూ కుమోను ఓడించారు. మీ కోసం పనిచేసే సిటీ కోసం పోరాటం చేస్తానని, సిటీని సురక్షితంగా ఉంచుతానని అన్నారు. విక్టరీ ప్రసంగంలో మాట్లాడుతూ.. స్వేచ్ఛగా ఉండవచ్చు అని, ఆహారం పొందవచ్చు అని, మనకు కావాల్సింది డిమాండ్ చేయవచ్చు అని తెలిపారు. మేయర్ ప్రైమరీ ఎన్నికల్లో కుమో గట్టి పోటీ ఇచ్చారు. మొన్నటి వరకు ఫెవరేట్‌గా ఉన్న కుమోకు కేవలం 36.4 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో ఆయన డెమోక్రటిక్ అభ్యర్థి రేసు నుంచి తప్పుకున్నారు.