Nikki Haley | వాషింగ్టన్: అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీకి తొలి విజయం లభించింది. వాషింగ్టన్ డీసీ ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఆమె గెలుపొందారు. దీంతో వరుస విజయాలతో దూసుకుపోతున్న ట్రంప్‌కు బ్రేక్ పడినట్లయింది.
అలాగే కీలకమైన సూపర్ ట్యూస్డే పోటీకి ముందు హేలీకి గొప్ప ఊతం లభించింది. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీని గెలుచుకున్న తొలి మహిళగా హేలీ రికార్డు సృష్టించారు. అదేవిధంగా డెమొక్రాటిక్ లేదా రిపబ్లికన్ ప్రైమరీని గెలుచుకున్న తొలి ఇండియన్-ఆమెరికన్‌గా కూడా ఆమె నిలిచారు.