వాషింగ్టన్: హెచ్1బీ వీసా ఫీజును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ పెంచిన వేళ అక్కడి రెండు దిగ్గజ కంపెనీలు తమ సీఈవోలుగా భారతీయుల పేర్లను ప్రకటించాయి. టెలికం దిగ్గజ కంపెనీ టీ-మొబైల్ భారత సంతతికి చెందిన 55 ఏండ్ల శ్రీనివాస్ శ్రీనీ గోపాలన్‌ను సీఈవోగా నియమించింది.
ఐఐఎం, అహ్మదాబాద్‌లో చదివిన గోపాలన్ ప్రస్తుతం టీ-మొబైల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. వైస్ చైర్మన్‌గా వెళ్తున్న మైక్ సీవర్ట్ స్థానంలో ఆయన సీఈవోగా నియమితులయ్యారు. అలాగే షికాగో కేంద్రంగా పనిచేసే దిగ్గజ పానీయ కంపెనీ మోల్సన్ కూర్స్.. 49 ఏండ్ల రాహుల్ గోయల్‌ను కొత్త ప్రెసిడెంట్, సీఈవోగా నియమించింది. అక్టోబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపడతారు. గోయల్ డెన్వర్‌లో బిజినెస్ మేనేజ్మెంట్ చదివారు.