Indian Origin Cop | కెనడాలో భారత సంతతి పోలీసు దారుణ హత్యకు గురయ్యాడు. అంటారియా ప్రావిన్షయిల్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తరుణ్ బాలి (29)ను ఓ దండుగుడు వాహనంతో ఢీకొట్టగా.. తీవ్రంగా గాయపడి మరణించాడు.
కెనడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న 18 ఏళ్ల యువకుడిని వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తుండగా.. తప్పించునేందుకు ప్రయత్నించాడు. పారిపోయే క్రమంలో నిందితుడు వాహనంతో తరుణ్‌ను ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన తరుణ్‌ను ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై అంటారియా ప్రొవిన్షియల్ పోలీసు కమిషనర్ థామస్ కరిక్ స్పందిస్తూ.. విధి నిర్వహణలో కానిస్టేబుల్ తరుణ్ బాలి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని తెలిపారు. ప్రజా సేవకు అంకితభావంతో పనిచేసిన ఆయన ధైర్యసాహసాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. కాగా, తరుణ్ బాలి దక్షిణ అంటారియోలోని డఫెరిన్ డిటాచ్మెంట్లో రెండేళ్లకు పైగా కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు.ఆయన సేవలు ఎప్పటికీ మరువలేవని.. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.