ఒట్టావా: కెనడాలో కొత్త క్యాబినెట్ ఏర్పడింది. దాంట్లో భారతీయ సంతతి వ్యక్తలుకు చోటు దక్కింది. అనితా ఆనంద్(Anita Anand)కు కీలకమైన మంత్రి పదవిని అప్పగించారు. విదేశాంగ మంత్రిగా ఆమె పదవీ స్వీకారం చేశారు. ప్రధాని మార్క్ కార్నే ఇటీవల క్యాబినెట్లో మార్పులు చేశారు. అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సింధు ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండు వారాల తర్వాత కార్నే తన క్యాబినెట్‌ను విస్తరించారు.
I am honoured to be named Canada’s Minister of Foreign Affairs. I look forward to working with Prime Minister Mark Carney and our team to build a safer, fairer world and deliver for Canadians. pic.twitter.com/NpPqyah9k3
— Anita Anand (@AnitaAnandMP) May 13, 2025
అంతకుముందు 58 ఏళ్ల అనితా ఆనంద్ .. ఇన్నోవేషన్, సైన్స్, ఇండస్ట్రీ శాఖ మంత్రిగా చేశారు. గతంలో డిఫెన్స్ మంత్రిగా కూడా చేశారు. విదేశాంగ శాఖలో మెలనీ జోలీ స్థానంలో ఇప్పుడు ఆనంద్ చేరారు. మెలనీ.. ఇప్పుడు పరిశ్రమల శాఖకు వెళ్లారు. విదేశాంగ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందని అనితా ఆనంద్ తన ఎక్స్ అకౌంట్లో తెలిపారు.